కొత్త పన్నుల విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. 3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని తెలిపారు. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000 వేలకు పెంచారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులు రూ.17,500 దాకా ఆదా చేస్తారన్నారు.
* ప్రస్తుతమున్న రెండు పన్ను విధానాల్లో పాత సిస్టమ్ లో ఎలాంటి మార్పులు చేయలేదు.
* ఈ ఆర్థిక సంవత్సరం(Financial Year)లో మూడింట రెండొంతుల మంది వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు నిర్మల తెలియజేశారు.
మినహాయింపులు ఇలా…
ఆదాయం | చెల్లింపు శాతం |
రూ.3,00,000 వరకు | 0% |
రూ.3,00,000 నుంచి రూ.7,00,000 వరకు | 5% |
రూ.7,00,000 నుంచి రూ.10,00,000 వరకు | 10% |
రూ.10,00,000 నుంచి రూ.12,00,000 వరకు | 15% |
రూ.12,00,000 నుంచి రూ.15,00,000 వరకు | 20% |
15,00,000 లక్షలకు రూపాయలకుపైగా | 30% |
మరిన్ని వార్తల కొరకు… ———–> | http://justpostnews.com
|