ఈ బడ్జెట్(Budget)లో విద్యారంగం(Education) నిధులకు కోత పడింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్లు కేటాయిస్తే ఈసారి తొమ్మిది వేల కోట్లు తగ్గి రూ.1.20 లక్షల కోట్లకు చేరుకుంది. UGC(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్)కు ఎక్కువగా 61 శాతం మేర కోత పెట్టారు. గతేడాది రూ.6,904 కోట్లు కేటాయింపులు జరిపితే.. ఈ సారి మాత్రం రూ.2,500 కోట్లకే పరిమితమైంది.
కేంద్రీయ విద్యాలయాల(KV)కు మాత్రం నిధులు పెరిగాయి. వీటికి అత్యధికంగా 28 శాతం మేర నిధులు పెరగడం విశేషంగా నిలిచింది. గత సంవత్సరం KVలకు రూ.1,200 కోట్లు కేటాయిస్తే.. ఈసారి అది 15,472 కోట్లకు పెరిగింది. కేంద్రీయ విద్యాలయాలతోపాటు నవోదయ విద్యాలయాలు, NCERTకి నిధులు స్వల్పంగా పెరిగాయి.