మహిళల ఆసియా కప్ ను చేజార్చుకున్న కొద్దిసేపటికే అదే భారత్-శ్రీలంక మధ్య జరిగిన పురుషుల టీ20లో టీమ్ఇండియా పట్టుబిగించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లంక.. 130/3తో పటిష్ఠం(Strong)గా కనిపించినా 140కు చేరుకునేసరికి 6 వికెట్లు చేజార్చుకుంది.
రవి బిష్ణయ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకుని లంకకు అడ్డుకట్ట వేశాడు. దీంతో ఆ టీమ్ 9 వికెట్లకు 161 స్కోరు చేసింది.
పథుమ్ నిశాంక(32), కుశాల్ మెండిస్(10), కుశాల్ పెరీరా(54), కమిందు మెండిస్(26), అసలంక(14), శానక(0), హసరంగ(0) పరుగులు చేశారు. బిష్ణోయ్ 3, హార్దిక్ పాండ్య, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ ముగ్గురూ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.