సివిల్ సర్వీసెస్-2023 ప్రిలిమ్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా 600 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. తెలంగాణ, ఏపీ నుంచి 71 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా అందులో 45 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు. గత మే 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా, దేశవ్యాప్తంగా 6 లక్షల మంది పరీక్ష రాశారు. కటాఫ్ మార్కుల ఆధారంగా 14,624 మంది మెయిన్స్ కు క్వాలిఫై అయ్యారు.