
యూనిఫాం సివిల్ కోడ్(UCC) పేరుతో BJP… ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తోందని CM కేసీఆర్ అన్నారు. ఈ బిల్లు వల్ల అన్ని మతాలకు చెందిన వ్యక్తుల్లో అయోమయం ఏర్పడుతోందని… దీనికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశాభివృద్ధిని మరచి ప్రజలను విభజించే కుట్రను BJP అమలు చేస్తోందని… ఈ బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటామన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతోపాటు పలువురు ముస్లిం పెద్దలతో క్యాంపు కార్యాలయంలో ఆయన మీట్ అయ్యారు. UCCని వ్యతిరేకించాలంటూ మత పెద్దలు CMకు వినతి పత్రం అందించారు.
భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని, అలాంటి వ్యక్తుల్ని చీల్చే కుట్రలు కొనసాగుతున్నాయని KCR తెలిపారు. మోదీ సర్కారు తీసుకువస్తున్న UCC బిల్లుపై CMతో చర్చించామన్న ఒవైసీ… ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. UCC పేరిట లౌకికవాదాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారంటూ… మతాల వారీగా ప్రజల్ని మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు చేశారు.