కోల్ కతాలో వైద్యురాలిపై హత్యాచారం(Rape-Murder), ఆ తర్వాతి పరిణామాలపై విస్తృత చర్చ(Debate) జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో డాక్టర్లు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడుల మీద అప్రమత్తత ప్రకటించింది. విధుల్లో ఉన్న స్టాఫ్ పై దాడికి పాల్పడిన 6 గంటల్లోనే FIR నమోదు చేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.
FIR రిజిస్టర్ చేయించే బాధ్యత హాస్పిటల్, కాలేజీ చీఫ్ దేనంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు ప్రతి హాస్పిటల్లోనూ భద్రతా ప్రమాణాలు పరిశీలించడం, వాటిని కాపాడేందుకు గాను కమిటీని ఏర్పాటు చేసింది. డెంగీ(Dengue), మలేరియా విజృంభిస్తున్న వేళ డాక్టర్లు నిరసన విరమించి డ్యూటీల్లో చేరాలని కోరింది.