మాస్ మహారాజగా ప్రేక్షకుల్లో ఇమేజ్ సంపాదించుకున్న నటుడు రవితేజ షూటింగ్ లో గాయాల(Injured) పాలయ్యారు. కుడిచేయి కండరానికి దెబ్బ తగలడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆరు వారాల పాటు విశ్రాంతి(Bed Rest) అవసరమని డాక్టర్లు తేల్చారు.
కొత్త మూవీ #RT75 చిత్రీకరణలో భాగంగా రవితేజ గాయపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ కూడా పూర్తి చేశారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ ఈ మధ్యనే విడుదలైంది.