కార్ రేసింగ్, ఫార్ములా వన్ అంటే ఇష్టపడే యువ నటుడు అక్కినేని నాగచైతన్య(Nagachaitanya) కార్ రేసింగ్ క్లబ్ ను కొనుగోలు(Purchase) చేశారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్(IRF)కు సంబంధించి హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని దక్కించుకున్నారు. ‘కల్కి’ సినిమాలోని బుజ్జి వాహనాన్ని ఇటీవలే నడిపి ఆసక్తి చాటుకున్న నాగచైతన్య.. కొత్త జర్నీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఈ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో మొత్తం ఆరు టీంలు తలపడుతున్నాయి. అతడు ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తుండగా.. ఈ కార్ రేసింగ్ ఆగస్టు 24న చెన్నైలో ప్రారంభమవుతుంది. మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ, బాలీవుడ్ యాక్టర్స్ జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ సైతం ఒక్కో జట్టును కొనుక్కున్నారు.