సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ కూల్చివేత(Demolish)పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున వేసిన పిటిషన్ పై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ(Hearing) చేపట్టారు. హైడ్రా చేపడుతున్న కూల్చివేతను ఆపాలని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. హైడ్రా తీరుపై నాగార్జున ఆలస్యంగా స్పందించారు.
మాదాపూర్ లోని N కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేందుకు తెల్లవారుజాము నుంచే అధికారులు అక్కడకు చేరుకున్నారు. మధ్యాహ్నానికి భవనం మొత్తం నేలమట్టం చేశారు. దీనిపై యాజమాన్యం పిటిషన్ వేయగా.. అది పూర్తి పట్టా భూమి అంటూ నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలోనూ తమకు నోటీసులు ఇచ్చారని, దీనిపై హైకోర్టు ఆదేశాలున్నా పట్టించుకోకుండా తాజాగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కన్వెన్షన్ ను కూల్చివేశారని వాదించారు.