BRS ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ గా మారినట్లేనా అన్న ఊహాగానాలు నిజం చేస్తూ ఆయన యూనివర్సిటీపై కేసు నమోదైంది. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని నాదం(Nadam) చెరువు బఫర్ జోన్లో అనురాగ్ విద్యా సంస్థల కట్టడాలున్నాయని అధికారులు ఫిర్యాదు చేశారు.
అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అక్రమ నిర్మాణాలు జరిపాయంటూ ఇరిగేషన్ AEE పరమేశ్.. పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు. సినీనటుడు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ నేలమట్టం చేసిన రోజే ఈ కేసు నమోదవడంతో అనురాగ్ యూనివర్సిటీ బిల్డింగ్ ల పైనా చర్యలు ఉండే అవకాశాలున్నాయి. తనపై అక్రమంగా కేసులు పెడుతూనే ఉన్నారన్న యజమాని పల్లా రాజేశ్వర్ రెడ్డి.. విద్యార్థుల్ని వేధిస్తున్నారని మండిపడ్డారు.