స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారిన పరిస్థితుల్లో మొబైల్(Mobile) లేనిదే జీవితం లేదంటూ ఒక స్టూడెంట్ రాసిన జవాబు.. సామాజిక మాధ్యమాల్లో(Social Media) వైరల్ గా మారింది. ఆ ఆన్సర్ కు ఫిదా అయిన టీచర్.. పదికి పది మార్కులు వేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తే.. ఈ వీడియోను 2.4 కోట్ల మంది వీక్షించారు. మొబైల్ వినియోగానికి సంబంధించిన ప్రశ్నకు ఆ చిన్నోడు రకరకాల విశ్లేషణలు చేశాడు. అవేంటో చూద్దాం…
మొబైల్ లేకపోతే మూడ్ బాగోదు…
మూడ్ బాగుండకపోతే చదువు రాదు…
చదవకపోతే ఉద్యోగం రాదు…
జాబ్ రాకపోతే డబ్బుండదు …
డబ్బు లేనిదే ఆహారం దొరకదు…
ఫుడ్ లేకపోతే అందవికారంగా మారతాం…
అప్పడెవరూ ప్రేమించరు, పెళ్లి కూడా చేసుకోరు…
అప్పుడు ఒంటరిగా మారి డిప్రెషన్లోకి వెళ్తాం…
డిప్రెషన్లోకి వెళ్తే అనారోగ్యానికి గురై చనిపోతాం…
అంటూ చివరన ‘నో మొబైల్.. నో లైఫ్’ రాశాడు.
ఆ టీచర్ కూడా మొబైల్ కు అడిక్ట్(Addict) అయినట్టున్నారు.. అందుకే పదికి పది మార్కులు వేశారు అంటూ కామెంట్స్ చేశారు. ‘ఇదే ఆధునిక జీవితం’, ‘ఇదే చేదు నిజం’, ‘ఇదే చాలా ప్రాక్టికల్ అనాలిసిస్’ అంటూ ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు పెట్టారు. ఎక్కడ జరిగింది, ఏంటన్నది పక్కనపెడితే… ఇదో ఫన్నీగా తయారైంది సోషల్ మీడియాలో.