రైతుల నిరసనలపై చేసిన కామెంట్స్ వివాదానికి దారితీయడంతో బాలీవుడ్ నటి, BJP ఎంపీ కంగనా రనౌత్ కు సొంత పార్టీ షాకిచ్చింది. ఆమె మాటలకు పార్టీతో సంబంధం లేదంటూ మందలించింది. ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకోకుంటే భారతదేశంలో రైతుల నిరసన బంగ్లాదేశ్ లాంటి సంక్షోభానికి దారితీసేది అంటూ ఆమె మాట్లాడారు.
విధాన నిర్ణయాలపై పార్టీ తరఫున మాట్లాడే అధికారం కంగనకు లేదంటూనే ఆమెకు ఆ పర్మిషన్ ఇవ్వలేని BJP హైకమాండ్ తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి(Mandi) నుంచి MPగా ఉన్న ఆమె.. గతంలోనూ అనేకసార్లు వివాదాస్పద కామెంట్స్ చేశారు.