రష్యాను ఒకానొక దశలో అంతర్యుద్ధం వరకు తీసుకెళ్లిన తిరుగుబాటు లీడర్, వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్ గెనీ ప్రిగోజిన్ ఎట్టకేలకు… ప్రెసిడెంట్ పుతిన్ తో మీట్ అయ్యారు. ప్రిగోజిన్ కు పుతిన్ క్రెమ్లిన్ లో ఆతిథ్యం ఇచ్చిన విషయం ఆలస్యంగా బయటపడింది. వీరిద్దరితోపాటు మిలిటరీ కమాండర్లు ఈ మీటింగ్ కు హాజరైనట్లు రష్యా ప్రభుత్వ స్పోక్స్ పర్సన్ దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. పుతిన్ పట్ల ప్రిగోజిన్ విశ్వాసాన్ని ప్రకటించారన్నారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో సైనికుల్ని కోల్పోతున్నామని, మిలిటరీ చీఫ్ ను మార్చాలంటూ ప్రిగోజిన్.. రష్యాపై తిరుగుబాటుకు ప్లాన్ చేశారు.
తొలుత మాస్కోపై దాడి చేయాలని భావించినా తర్వాత ఆ డిసిషన్ ను మార్చుకున్నారు. అనంతరం వాగ్నర్ గ్రూప్ చీఫ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. రష్యాలో ఉండొచ్చు లేదంటూ పొరుగు దేశమైన బెలారస్ లోనైనా ఆశ్రయం పొందవచ్చు అంటూ సూచించింది. దీంతో వాగ్నర్ గ్రూప్ చీఫ్ బెలారస్ కు వెళ్లారు.