దేశవ్యాప్తంగా ఐదు రోజుల పాటు పాస్ పోర్టు సేవలు(Services) నిలిచిపోనున్నాయి. టెక్నికల్ మెయింటెనెన్స్ కారణంగా ఈరోజు నుంచి సెప్టెంబరు 2 వరకు పాస్ పోర్టు సేవలు పనిచేయవు. దీంతో కొత్త పాస్ పోర్ట్ తీసుకునేవారు 5 రోజుల పాటు ఆగాల్సి(Wait) ఉండగా.. ఇప్పటికే షెడ్యూల్ చేసిన వాటిని రీషెడ్యూల్ చేస్తున్నారు.
ఆగస్టు 29 రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబరు 2 ఉదయం వరకు పాస్ పోర్ట్ డిపార్ట్మెంట్ పోర్టల్ పనిచేయదు. ఈ టైమ్ లో పౌరులు, పోలీసులు, అధికారులకు సిస్టమ్ అందుబాటులో ఉండదు. 2024 ఆగస్టు 30 నాటికి బుక్ చేసిన అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ చేస్తారు.
3 రకాల పాస్ పోర్టులు…
భారత్ లో 3 రకాల పాస్ పోర్టులున్నాయి. పోస్టులను బట్టి పాస్ పోర్టు(Passports)లు ఇస్తారు. బ్లూ కవర్ పాస్ పోర్టు ఏ పౌరుడికైనా ఇవ్వవచ్చు. మెరూన్ కవర్ కార్డును డిప్లొమాటిక్ గా పిలుస్తుండగా.. దీన్ని దౌత్య, ప్రభుత్వ పదవులు కలిగిన వ్యక్తులకు కేటాయిస్తారు. ఇక గ్రే కవర్ కార్డును విదేశాల్లో ఉన్న ప్రభుత్వ సేవకులు లేదా అధికారిక అసైన్మెంట్ పై పంపినవారికి ఇస్తారు.