వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. రేపు సైతం ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. అతి భారీతోపాటు అత్యంత భారీ(Very Heavy)గా వానలు పడే ఛాన్సెస్ ఉన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది.
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కొన్నిచోట్ల ప్రమాదకర పరిస్థితులుంటాయని IMD() హెచ్చరించింది.