రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని(UPS) ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని, 1980 రివైజ్డ్(Revised) పెన్షన్ రూల్స్ ప్రకారం OPSనే పునరుద్ధరించాలంటూ రాష్ట్ర ఉద్యోగుల JAC కోరింది. ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో సంఘం నాయకులు.. ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డిని కలిశారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రికి స్పష్టత ఉందన్న చిన్నారెడ్డి.. ఉద్యోగులకు మేలు జరిగే పెన్షన్ విధానాన్ని అమలు చేసే విషయంలో CMతో మాట్లాడతానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పిదాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే తమ నిర్ణయం చెబుతామని ఆయన హామీ ఇచ్చారు.