అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Biswa Sarma) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం MLAలకు కేటాయించిన శుక్రవారం నమాజ్ సమయాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. జుమ్మా ప్రార్థనల కోసం 1937 నుంచి అమలవుతున్న రెండు గంటల సమయాన్ని(Friday Break) రద్దు చేస్తూ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంపై NDA మిత్రపక్షాలైన జనతాదళ్ యూ(JDU), లోక్ జనశక్తి పార్టీ(LJP) తీవ్ర విమర్శలు చేశాయి. ఇది హిందూ, ముస్లింలకు ఒకేతీరుగా వర్తింపజేస్తారా.. కామాఖ్య అమ్మవారి పూజల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన మత విశ్వాసాలను దెబ్బతీయడం సరికాదంటూ బిహార్ కు చెందిన ఈ రెండు పార్టీల నేతలంటున్నారు.