భగభగ మండుతున్న భానుడి ప్రభావానికి పాఠశాలల పునఃప్రారంభం నాడు పిల్లల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల హాజరు చాలా తక్కువగా నమోదైంది. సగటున 30-40 శాతం లోపునే ఉన్నట్లు ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తే ఎండలు తగ్గిన తర్వాత పంపిస్తామంటున్నారని కొంతమంది తెలిపారు. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం వరకే కొన్ని స్కూళ్లలో తరగతులు నిర్వహించారు.