కులగణన ద్వారా డేటా(Caste Data) సేకరణకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) మద్దతునిచ్చింది. అయితే ఈ డేటాను సంక్షేమ కార్యక్రమాలకే తప్ప రాజకీయాలకు వాడకూడదని సూచించింది. కులగణనపై ప్రతిపక్ష కూటమైన INDIA బ్లాక్ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తుండగా.. అధికార BJPకి సైద్ధాంతిక(Ideological) మూలాధారమైన RSS ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరంగా నిలిచింది.
‘హిందూ సమాజంగా మేం ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చాం.. మాకు కులం, కుల సంబంధాలు వంటి సున్నితమైన సమస్య ఉంది.. నిజానికి ఇది జాతీయ ఐక్యత, సమగ్రతకు సంబంధించింది.. ఈ అంశాన్ని సీరియస్ గా చూడాల్సి ఉంది..’ అంటూ RSS అధికార ప్రతినిధి సునీల్ అంబీకర్ అన్నారు. NDA కూటమిలోని JDU సైతం కులగణనను బిహార్లో పూర్తి చేసింది.
ఇలా కొన్ని మిత్రపక్షాలు సహా విపక్ష ఇండియా కూటమి డిమాండ్ల నడుమ.. క్యాస్ట్ సెన్సస్ పై BJP పెద్దగా ఇంట్రస్ట్ చూపని పరిస్థితుల్లో RSS తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.