వర్షాల జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈరోజు కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ(Very Heavy) వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఐదు జిల్లాల్లో బుధవారమంతా ‘ఆరెంజ్ అలర్ట్’ ఉంటుంది.
ఇక రేపట్నుంచి ఈనెల 8 వరకు మరో నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటిలో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. దక్షిణ తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉత్తర తెలంగాణలోని ఒకట్రెండు జిల్లాలు మినహాయిస్తే రాష్ట్రమంతా వానలు పడే అవకాశాలున్నాయి. అందుకే ఆయా జిల్లాలకు రేపట్నుంచి నాలుగు రోజుల పాటు ‘యెల్లో’ అలర్ట్ ప్రకటించింది.