దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏ(DA)లను విడుదల చేయాలంటూ తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(TGEJAC).. డిప్యూటీ CM భట్టి విక్రమార్కను కోరింది. పే రివిజన్ కమిషన్(PRC) రిపోర్టును వెంటనే తెప్పించుకుని అమలు చేయడంతోపాటు 51% ఫిట్మెంట్ ను అందజేయాలంటూ నాయకులు వినతి సమర్పించారు.
ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేయడంతోపాటు ఈ-కుబేర్ లోని పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి ఆ ఈ-కుబేర్ సిస్టమ్ ను రద్దు చేయాలన్నారు. ఎన్నికల వేళ బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి వారిని పాత స్టేషన్ కే రప్పించాలని, 317 జీవోలోని సమస్యల్ని పరిష్కరించాలంటూ మొత్తం 39 డిమాండ్లను డిప్యూటీ CM దృష్టికి తీసుకెళ్లారు. JAC ఛైర్మన్ మారం జగదీశ్వర్, కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, స్టీరింగ్ కమిటీ మెంబర్ దేవరకొండ సైదులు తదితర నాయకులు భట్టిని కలిశారు.