బీసీ కులవృత్తులకు చేయూతగా అందించే ఆర్థిక సాయం నిధుల్ని BC సంక్షేమ శాఖ రిలీజ్ చేసింది. రూ.లక్ష ఆర్థిక సాయం కోసం అప్లయ్ చేసుకున్న వారిని పరిశీలన చేసి డబ్బులు అందజేయనున్నారు. ఇప్పటికే తొలి దశలో స్క్రూటిని ప్రక్రియను గ్రౌండ్ లెవెల్లో పూర్తి చేశారు. ఇందుకోసం రూ.400 కోట్లను విడుదల చేస్తూ BC సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ కింద 5,28,862 అప్లికేషన్లు రాగా సీరియల్ నంబర్ల ఆధారంగా గ్రౌండ్ లెవెల్ ఎంక్వయిరీ నిర్వహిస్తున్నారు. ప్రతి నెల 5వ తేదీ నాటికి స్క్రూటిని పూర్తి చేసి ఆ నెల 15 కల్లా అర్హులైన వారికి రూ.లక్ష సాయం అందిస్తారు.