రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల(Schools)కు హామీ ఇచ్చిన మేరకు సర్కారు కీలక నిర్ణయాన్ని అమలు చేసింది. అన్ని పాఠశాలలకు ఉచిత విద్యుత్తు(Free Power)ను అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ అమలు చేస్తున్న నిర్ణయం మేరకు ఉచిత విద్యుత్తుపై జీవోను విద్యుత్తు శాఖ జారీ చేసింది. ఈ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,862 బడులకు ఫ్రీ కరెంటు సరఫరా కానుంది.
ఇందుకోసం తెలంగాణ డిస్కమ్ లు ఆన్ లైన్(Online) పోర్టల్ ను తయారు చేస్తాయి. ఏయే విద్యాలయాలకు కరెంటు అవసరమో ఆ వివరాల్ని కార్యదర్శులే పోర్టల్లో నమోదు చేయాలి. కరెంటు వాడిన ప్రతి స్కూలుకు సంబంధించిన బిల్లుని పోర్టల్లో ఉంచుతారు. ఎన్ని యూనిట్ల వాడారన్న హార్డ్ కాపీలను స్కూల్ ఇంఛార్జికి అందిస్తారు. తర్వాత రాష్ట్రవ్యాప్త బిల్లుల్ని ఫైనాన్స్ డిపార్ట్మెంటుకు డిస్కమ్ లు పంపుతాయి.