ఇప్పటికే అన్ని శాఖలు(Departments) పెద్ద మనసు చాటుకోగా.. తాజాగా విద్యుత్తు శాఖ సిబ్బంది సైతం ఉదారత చూపించారు. వరదల వల్ల సర్వం కోల్పోయి దీనావస్థలో నిలిచిన వారి కోసం ఒక రోజు మూల వేతనాన్ని అందజేస్తున్నట్లు విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) ప్రకటించింది. అన్ని కేడర్ల సిబ్బంది, పెన్షనర్లకు సంబంధించిన రూ.15 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది.
రెండు రోజుల క్రితం తెలంగాణ ఎంప్లాయిస్ JAC.. తమ ఉద్యోగుల ఒకరోజు మూలవేతనమైన రూ.130 కోట్లను ముఖ్యమంత్రికి అందజేసింది. ఇప్పుడు విద్యుత్తు శాఖ సైతం బాధితులకు తామున్నామన్న భరోసా కల్పిస్తూ రూ.15 కోట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అందజేసింది.