ఉక్రెయిన్ యుద్ధం(War) మొదలైన తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిగివచ్చారు. ఉక్రెయిన్ తో చర్చలకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ అందుకు బలమైన మధ్యవర్తిగా భారత్ సరైనదన్నారు. వ్లాదివోస్టాక్(Vladivostok)లో జరిగిన ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొన్న పుతిన్.. శాంతి చర్చల విషయాన్ని మరచిపోలేదన్నారు.
ఒకవేళ ఉక్రెయిన్ తో చర్చలు జరపాల్సి వస్తే భారత్ తోపాటు చైనా, బ్రెజిల్ దేశాలు మధ్యవర్తిత్వానికి సరైనవని స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి భారత్ రెడీగా ఉంటుందని రష్యా, ఉక్రెయిన్లో పర్యటించిన సందర్భంగా మోదీ అనడాన్ని పుతిన్ గుర్తు చేశారు.