రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు భారత్ తన ప్రయత్నం మొదలుపెట్టింది. జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్ పర్యటనతో ఇది ముందుకు కదలనుంది. దోవల్(Doval) ఈ వారంలో రష్యా రాజధాని మాస్కోకు వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే జెలెన్ స్కీతో భేటీ అయిన మోదీ.. యుద్ధ విరమణకు ప్రయత్నిస్తామన్నారు.
ఉక్రెయిన్ టూర్ తర్వాత ఆగస్టు 27న పుతిన్ తో మోదీ ఫోన్లో మాట్లాడారు. భారతే తమకు మంచి మధ్యవర్తి(Mediator) అని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం స్పష్టం చేసిన పరిస్థితుల్లో శాంతి చర్చలకు భారత్ సై అంది. దీంతో ఈ వారంలో అజిత్ దోవల్ మాస్కో వెళ్లే అవకాశాలున్నాయి. అయితే ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు.