శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం(Decision) తీసుకోకపోతే సుమోటో(Suo Moto)గా తీసుకుని కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
BRS నుంచి కాంగ్రెస్ లో చేరిన MLAలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ ప్రధాన ప్రతిపక్ష MLAలు కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్ వేశారు. అటు BJP శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సంచలన తీర్పునిచ్చింది. 4 వారాల్లో షెడ్యూల్ ఇవ్వడంతోపాటు, ఇరుపక్షాల వాదనలకు తేదీలు నిర్ణయించాలన్న న్యాయస్థానం.. ఆ వివరాల్ని హైకోర్టు రిజిస్ట్రీకి అందజేయాలని ఆదేశించింది.