70 ఏళ్లు దాటిన వారందరికీ రూ.5 లక్షల హెల్త్ కవరేజ్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ PM జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఏడాదికి రూ.5 లక్షల చికిత్సను ఉచితంగా అందించనుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయం 4.5 కోట్ల కుటుంబాలకు, 6 కోట్ల మంది వృద్ధులకు లాభం చేకూర్చనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
ఇప్పటికే CGHS, ECHS, ఆయుష్మాన్ CAPF సహా పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగినవారు.. తమ ప్రస్తుత పథకాన్ని కంటిన్యూ చేయడానికి లేదా AB PM-JAYకి మారడానికి కేంద్రం అవకాశం కల్పించింది. తక్కువ వయసున్న ఇతర కుటుంబ సభ్యుల కవరేజీతో సంబంధం లేకుండా ఈ స్కీమ్ వర్తించనుండగా.. ఇందుకోసం ప్రత్యేక కార్డును జారీ చేస్తారు.