ఓవరాక్షన్ చేసే ఏ నాయకుణ్నైనా వదిలిపెట్టొద్దని, దుమ్ముదులిపే పనిలో ఉండండంటూ DGPని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు BRS పార్టీ కుట్రలు చేస్తున్నదన్న అభిప్రాయానికి వచ్చిన CM.. ఈ విషయంలో ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు(Law&Order) భంగం కలిగించే రాజకీయ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దన్నారు. రెండ్రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
BRS నుంచి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి MLA అరికపూడి గాంధీకి హుజూరాబాద్ MLA కౌశిక్ రెడ్డి సవాల్ విసరడం, దానికి ప్రతిస్పందనగా కౌశిక్ ఇంటికి గాంధీ వెళ్లడం, ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత ఏర్పడి అరెస్టులు జరిగాయి. గులాబీ పార్టీ MLAల్ని అరెస్టు చేసి తరలిస్తున్న సమయంలో 2 గంటల పాటు గందరగోళం ఏర్పడటంతో లాఠీఛార్జి చేశారు.