భారీ వర్షాల్ని ఒక్కసారిగా ఆపితే… చీకటిలా కమ్ముకున్న మబ్బుల్ని తొలగించి వెలుతురునిస్తే… ఇప్పటిదాకా దేశంలో కృత్రిమ వానల కోసం మేఘ మథనం సృష్టించడం చూశాం.. కానీ భారీ వర్షాల్ని అదుపు చేయగల సాంకేతికత(Technology) రానుందా అంటే.. అవుననే సమాధానమే ఉంది. వానల్ని భారీ వర్షాలుగా పెంచడం.. కుంభవృష్టిని సాధారణ వానలా మార్చడంపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు మొదలుపెట్టారు. వడగళ్లు, వెలుతురు లేని ప్రాంతాల్లోనూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఏడాదిన్నరలో ల్యాబ్ సిమ్యులేషన్స్(Cloud Chambers) ఏర్పాటు చేస్తామని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఐదేళ్ల కాలంలోనే అనుకున్నది సాధించి తీరతామని నిపుణులు చెబుతున్నారు. క్లౌడ్ బరస్ట్ సహా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్నైనా నియంత్రించేలా ఛాట్ GPT తరహాలో ‘మౌసమ్ GPT’ అభివృద్ధి చేయబోతున్నారు. ఆడియో, వాయిస్ రెండు రూపాల్లో ప్రజలకు సమాచారం చేరవేసేలా డెవలప్ చేస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా క్లౌడ్ సీడింగ్ చేపట్టి పంటల్ని రక్షించే విధానం అమెరికా, రష్యా, చైనా, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఉంది.