కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి సన్నిధికి నిత్యం 60 నుంచి 80 వేల దాకా భక్తులు(Devotees) వస్తుంటారు. దీంతో కొండపైకి ఎక్కే వాహనాలు కూడా వేలల్లోనే ఉంటాయి. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో ఇది డబుల్ అవుతుంటుంది. అందుకే ఈ అక్టోబరు 4 నుంచి 12 వరకు జరిగే వార్షిక(Annual) బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నది TTD.
తిరుమల కొండపై ప్రస్తుతానికి 11 వేల వాహనాలకు పార్కింగ్ సదుపాయం(Fecility) ఉంది. శ్రీవారి వేడుకల వేళ భారీగా బండ్లు వస్తాయి కాబట్టి అదనపు పార్కింగ్ కోసం TTD దృష్టి పెట్టింది. మ్యాన్ పవర్, CCTVలు, అదనపు బందోబస్త్, రవాణా, వసతి సౌకర్యాలను కల్పించేందుకు EO జె.శ్యామలారావు ప్రత్యేక రివ్యూ నిర్వహించారు.