తొమ్మిది రోజుల పాటు లక్షలాది భక్తుల విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం పూర్తి చేసుకున్నాడు. వేల సంఖ్యలో భక్తజనం తరలిరాగా, ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రాన్ని తలపించగా గణనాథుడి నిమజ్జన కార్యక్రమం ఘనంగా పూర్తయింది. ఎన్టీఆర్ మార్గ్ లో ప్రత్యేక క్రేన్ ద్వారా వెళ్లిరావయ్య మళ్లీ రావయ్యా అంటూ స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ క్రతువును తిలకించేందుకు భక్తులు పొద్దున్నుంచే అక్కడకు చేరుకున్నారు.