
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ‘భోళా శంకర్’ షూటింగ్ కంప్లీట్ చేశారు. అలాగే డబ్బింగ్ వర్క్ కూడా ఫినిష్ చేసిన ఆయన.. రీసెంట్గా వైఫ్ సురేఖతో కలిసి అమెరికాకు వెకేషన్ కోసం వెళ్లారు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోళా శంకర్’ చిత్రం ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే, ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీమ్.. తాజాగా ‘జామ్ జామ్ జజ్జనక’ అనే పార్టీ సాంగ్‌ను రెండో సింగిల్‌గా రిలీజ్ చేసింది. ఇందులో లవ్లీ బ్యూటీస్ కీర్తి సురేష్, తమన్నా భాటియాతో పాటు సుశాంత్ కూడా కనిపించారు. ఇది సినిమాలో ఏదో వేడుకకు సంబంధించిన సాంగ్‌గా తెలుస్తోంది.
మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా.. తనదైన గ్రేస్, స్టైల్‌తో ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్లో డాన్స్ ఇరగదీశారు చిరు. స్టైలిష్‌గా కనిపిస్తూనే మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆశ్చర్యపరిచాడు. ఇక కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం కూడా ఈ పార్టీ సాంగ్‌కు పర్ఫెక్ట్గా మ్యాచ్ కావడం విశేషం. అంతేకాదు సాంగ్ మధ్యలో జోష్ కోసం పాపులర్ తెలంగాణ ఫోక్ ‘నర్సపెల్లి’ సాంగ్‌లోని కొంత పార్ట్‌ను ఇందులో యాడ్ చేసి జోష్ తీసుకొచ్చారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ ‘భోళా శంకర్’ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది.