లెబనాన్ లో పేజర్ల(Pagers) పేలుళ్లు కలకలం సృష్టించాయి. 10 మంది దాకా చనిపోతే 3 వేల మందికి పైగా గాయపడగా.. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. రాజధాని బీరుట్ సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గంట వ్యవధిలోనే వరుసగా పేజర్లు పేలాయి. ఇవన్నీ సాఫ్ట్ వేర్ సంబంధిత అటాక్ లేనని నిపుణులు అంటున్నారు.
అసలు పేజర్లంటే…
పేజర్ అనేది అక్షరాలు, అంకెలతో మెసేజ్ లు పంపించే వైర్ లెస్ టెలీకమ్యూనికేషన్స్ సాధనం. మెసేజ్ పంపించడంతోపాటు రిసీవ్ చేసుకోవడం, చదవడం, వాయిస్ అయితే వినడం చేయొచ్చు. తమ లొకేషన్లను ఇజ్రాయెల్ ట్రాక్ చేయకుండా ఉండేందుకే ఈ పేజర్లను లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూప్ వాడుతున్నది. పేజర్ల బ్యాటరీలు ఎక్కువగా వేడయ్యే(Heat)లా హ్యాకింగ్ చేసి పేలుళ్లకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.
సిగ్నల్స్ ద్వారా…
ఒక పరికరంలో 20 గ్రాముల దాకా పేలుడు పదార్థాన్ని నింపి వాటిని పేజర్లలో అమర్చారని, టెక్ట్స్ మెసేజెస్ ద్వారా సిగ్నల్స్ పంపించి పేలుళ్లకు పాల్పడి ఉంటారని, ఇది ఇజ్రాయెల్ పనేనని లెబనాన్ ఆరోపించింది. వీటిని తయారు చేసినప్పుడే లేదంటూ వాటిని రవాణా చేస్తున్నప్పుడు ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.