రాష్ట్రంలో మరో ఉద్యోగ ప్రకటన(Notification) వెలువడింది. వైద్యారోగ్య శాఖలో 2,050 పోస్టుల భర్తీకి గాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వీటిని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్(TVVP)లో 332, ఆయుష్ విభాగంలో 61, MNJ క్యాన్సర్ హాస్పిటల్లో 80, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ఒక పోస్టును భర్తీ చేస్తారు. ఈ పోస్టులన్నీ నర్సింగ్ ఆఫీసర్ కేడర్ వే ఉన్నాయి. వివరాలకు https://mhsrb.telangana.gov.in సంప్రదించవచ్చు.
అప్లై వివరాలు ఇలా…
ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం….: 28-09-2024
అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేదీ…: 14-10-2024 సాయంత్రం 5 గంటల వరకు
అప్లికేషన్ల ఎడిట్..: 16-10-2024 ఉ.10:30 నుంచి 17-10-2024 సా.5 గంటల వరకు
పరీక్ష(CBT పద్ధతిలో) జరిగే తేదీ…: 17-11-2024