అత్యాచార(Rape) కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. అతణ్ని బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం. అసిస్టెంట్ డ్యాన్సర్(Dancer)పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జానీపై కేసు నమోదైంది. అతణ్ని జనసేన పార్టీ సస్పెండ్ చేయగా, సినీ పరిశ్రమ సైతం వేటు వేసింది.
బాధితురాలు బుధవారం మహిళా కమిషన్ లోనూ కంప్లయింట్ చేశారు. బెదిరింపులు, లైంగిక వేధింపులతోపాటు పోక్సో కేసు ఫైల్ చేశారు. పరారీలో ఉన్న జానీ కోసం నాలుగు పోలీసు టీంలు రంగంలోకి దిగగా.. నిందితుణ్ని SOT(స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) అదుపులోకి తీసుకుంది.