హెజ్బొల్లా గ్రూపులే లక్ష్యంగా రాకెట్లతో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్ లోని హెజ్బొల్లా(Hezbollah) స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) 30 రాకెట్లు, 150 లాంఛర్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఎంత నష్టం జరిగిందనేది ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ దాడులపై హెజ్బొల్లా లీడర్ హసన్ నస్రల్లా తీవ్రంగా స్పందిస్తూ ఇజ్రాయెల్ కు తగిన జవాబిస్తామని వార్నింగ్ ఇచ్చాడు.
పేజర్లు, వాకీటాకీలు, ల్యాండ్ లైన్ల పేలుళ్లతో సోమ, మంగళవారాల్లో లెబనాన్ వ్యాప్తంగా 32 మంది చనిపోగా, 3,500 మంది దాకా గాయపడ్డారు. ఇవి ఇజ్రాయెల్ పేలుళ్లేనని హెజ్బొల్లా ఆరోపించిన కొన్ని గంటల్లోనే దాని స్థావరాలపై IDF బాంబుల వర్షం కురిపించింది.