తిరుమల లడ్డూలో నెయ్యి నాణ్యతపై దుమారం రేగుతున్న వేళ దేవస్థానం EO సంచలన విషయాలు వెల్లడించారు. నెయ్యి క్వాలిటీని గుర్తించేందుకు గుజరాత్ లోని NDDB ల్యాబ్ కు జులై 6న పంపించామని, ఆ పరీక్షల్లో నాణ్యత లేదని తేలిందని TTD ఈవో శ్యామలరావు తెలిపారు. జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపినట్లు తేలగా.. 100 పాయింట్ల క్వాలిటీకి గాను 20 పాయింట్లే ఉన్నట్లు గుర్తించారన్నారు. నెయ్యి కల్తీని గుర్తించిన వెంటనే దీనిపై కమిటీ వేశామన్న EO.. గతంలో అసలు టెస్టులే చేయలేదన్నారు.