సింగరేణి కార్మికులకు ఈసారి భారీగా బోనస్ దక్కింది. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి ప్రకటించిన బోనస్.. మొత్తంగా రూ.796 కోట్లుగా ఉంది. ఒక్కో కార్మికుడికి ఈ లెక్కన రూ.1.90 లక్షలు అందనున్నాయి. అయితే గతానికి భిన్నంగా ఈసారి కాంట్రాక్ట్ కార్మికులకు సైతం రూ.5 వేల చొప్పున బోనస్ ఇసున్నారు.
గతేడాది కంటే ఈసారి ఒక్కొక్కరికి రూ.20 వేలు అదనం(Extra)గా వస్తుండగా.. కంపెనీ సాధించిన లాభాల్లో 33 శాతాన్ని సిబ్బందికి పంచుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2023-24 సంవత్సరానికి గాను సంస్థ రూ.4,701 కోట్ల లాభాల్ని సాధిస్తే… సంస్థ విస్తరణ, పెట్టుబడులకు రూ.2,289 కోట్లు కేటాయించారు. మిగిలిన రూ.2,412 కోట్లలో మూడో వంతును బోనస్ ప్రకటించారు.