మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. అక్టోబరు 28న ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు. ANR శత జయంతి వేడుకల సందర్భంగా ఈ అవార్డును అధికారికంగా తెలియజేయగా.. 28న జరిగే వేడుకకు చీఫ్ గెస్ట్ గా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హాజరవుతారు.
నాగేశ్వరరావు గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏర్పాటైంది. చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తుగా అవార్డు ఇస్తుండగా.. తొలిసారిగా 2006లో బాలీవుడ్ నటుడు దేవానంద్ కు అందజేశారు.