మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్ల(Riots) వెనుక విదేశీ హస్తం ఉందన్న మాటలు నిజమయ్యాయి. పొరుగున ఉన్న మయన్మార్(Myanmar) నుంచి 900 మంది మిలిటెంట్లు చొరబడ్డట్లు మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. అటవీప్రాంతాల్లో డ్రోన్లతో కూడిన బాంబు దాడులకు పాల్పడేలా శిక్షణ పొందిన మయన్మార్ కుకీ మిలిటెంట్లు.. రాష్ట్రంలో చొరబడ్డారని గుర్తించారు.
ఒక్కో గ్రూపులో 30 మందిని నియమించి వారికి ఒక్కో ప్రాంతాన్ని కేటాయిస్తారు. ఈ నెలలో మైతీలపై వివిధ రకాలుగా దాడులకు పాల్పడటాన్ని కుల్దీప్ గుర్తు చేశారు. మయన్మార్‌లోని చిన్ సహా వివిధ రాష్ట్రాల్లో అలజడి సృష్టిస్తున్న జుంటా ఉగ్రవాద గ్రూప్.. భారత్ లోకి ఎంటరైనట్లు తేల్చారు. భారత్-మయన్మార్ బోర్డర్లో దక్షిణ మణిపూర్ జిల్లాల్లోని అందరూ SPలను అలర్ట్ చేశారు.