ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన కోసం అమెరికా బయల్దేరి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం(IST) రాత్రి 7:30 గంటలకు ఆయన ఫిలడెల్ఫియాలో అడుగుపెడతారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్, డెలావేర్ చేరుకుని ఆయనతో ద్వైపాక్షిక(Bilateral) చర్చలు జరుపుతారు.
* అంతరిక్ష రంగంలో ముందడుగు పడొచ్చు. గ్రూప్ కెప్టెన్ శుభాన్ష్ శుక్లా ఆక్సియం-4లో ISSలో ప్రయాణించనున్న దృష్ట్యా ఈ ఒప్పందం కీలకమవుతుంది.
* US నుంచి 31 ప్రెడేటర్ డ్రోన్ల విషయంలో బిలియన్ డాలర్ల ఒప్పందం జరగనుంది.
* జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు ఆంథోని ఆల్బనీస్, ఫుమియో కిషిదతో కలిసి క్వాడ్ సమ్మిట్లో పాల్గొంటారు.
* చైనా దుందుడుకు వ్యవహారం, డ్రాగన్ వల్ల ఇబ్బందిగా మారిన వాణిజ్య రంగం, తైవాన్ జలసంధి ఉద్రిక్తతలపై చర్చించే ఛాన్స్ ఉంది.
* రష్యా-ఉక్రెయిన్లలో తాను చేపట్టిన టూర్లు, వాటి మధ్య శాంతి ప్రక్రియపై చర్చలు
* న్యూయార్క్ లో భారతీయులతో భేటీ…
* AI, క్వాంటమ్ కంప్యూటింగ్ బయో టెక్నాలజీ, సెమీ కండక్టర్ రంగాలపై కంపెనీల CEOలతో సమావేశం
* భవిష్యత్తు శిఖరాగ్ర సదస్సులో భాగంగా న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగం
* ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పురోగతిపై చర్చ
* ఐరాస సమావేశం అనంతరం వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు