రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా(Any Where) రేషన్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తామని CM రేవంత్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని CLP(కాంగ్రెస్ లెజిస్టేటివ్ పార్టీ) సమావేశంలో అన్నారు. అక్టోబరు 2 నుంచి కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
వచ్చే జనవరి నుంచి రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీంతో జనవరి లోపే కొత్త కార్డులు రాబోతున్న వేళ.. ఎక్కణ్నుంచైనా రేషన్ తీసుకునే అంశాన్ని రేవంత్ గుర్తు చేశారు.