ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘దేవర’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ను రద్దు(Cancel) చేయడం గందరగోళానికి దారితీసింది. మాదాపూర్ నోవాటెల్ హోటల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా… భద్రతా కారణాల రీత్యా ప్రోగ్రాంను రద్దు చేశారు. అప్పటికే వేలాదిగా లోపలికి దూసుకువచ్చిన NTR అభిమానులు.. అసలు విషయం తెలుసుకుని ఆగ్రహం చెందారు. వాళ్ల దాడిలో హోటల్ అద్దాలు పగిలిపోయాయి.
ఒక్కసారిగా గేట్లు దాటి లోపలికి దూసుకువచ్చిన జనంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి(Situation)ని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పాసులు ఇవ్వడంలో తలెత్తిన గందరగోళం వల్లే ఇలా జరిగిందని, కెపాసిటీకి మించి వాటిని పంచారని పలువురు ఆరోపిస్తున్నారు.