పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అనర్హులుగా ప్రకటించి వారందరికీ జీతాలు(Salaries), అలవెన్సులు(Allowances) ఇవ్వకుండా చూడాలంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఎ.పాల్ ఈ పిటిషన్ వేశారు. పార్టీ మారిన 10 మంది MLAలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సదరు శాసనసభ్యులంతా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.