దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. పామోలిన్, సోయా, పొద్దుతిరుగుడు(Sunflower)పైనే దిగుమతి సుంకం విధిస్తే.. మార్కెట్లలో మాత్రం అన్ని రకాల నూనెలు పెంచారు. 50 రోజులకు సరిపడా నిల్వలున్నా ధరలు ఎందుకు పెంచుతున్నారో చెప్పాలంటూ వంటనూనెల కంపెనీలను కేంద్రం ఆదేశించింది.
రిఫైన్డ్ పామాయిల్, సోయాబిన్, సన్ ఫ్లవర్ పై 20% పన్ను విధించగా.. అది కాస్తా 12.5% నుంచి 32.5%నికి పెరిగింది. వీటిపై అగ్రికల్చర్ సెస్ అదనం(Extra) కావడంతో దిగుమతులు తగ్గి రేట్లు పెరగ్గా.. ఇంకా పెంచే అవకాశాలున్నాయి. విదేశీ దిగుమతుల వల్లే దేశంలో పంట ధరలు పడిపోతున్నాయన్న కేంద్రం.. అందుకే సుంకం విధిస్తున్నట్లు తెలిపింది. వంట నూనెల దిగుమతుల్లో ప్రపంచంలోనే భారత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
దేశానికి 25 మిలియన్ టన్నుల ఉత్పత్తులు అవసరం కాగా.. కేవలం 10 మిలియన్ టన్నులే ఉంటున్నాయి. మిగతా 15 శాతం నూనెల కోసం లక్ష కోట్ల రూపాయలు పొరుగు దేశాలకు వెచ్చిస్తున్నాం. అందుకే 2025-26 నాటికి 25 లక్షల ఎకరాల్లో నూనె గింజల ఉత్పత్తి జరగాలన్నది లక్ష్యం. కరోనా కాలంలోనూ, ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో హయ్యెస్ట్ గా పామాయిల్ రూ.170, సన్ ఫ్లవర్ రూ.200 అయింది. సన్ ఫ్లవర్ ను ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే ఉక్రెయిన్.. యుద్ధంతో పంట కోల్పోయింది.