హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్(Israel) సాగిస్తున్న భీకర దాడితో లెబనాన్ లో చిన్నారులు సహా 180 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా గాయపడ్డట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. దక్షిణ లెబనాన్ లోని హెజ్బొల్లాపై విరుచుకుపడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం ప్రకటించిన కొద్ది గంటల్లోనే భీకర దాడి మొదలైంది.
పేజర్లు, వాకీటాకీలు, ల్యాండ్ లైన్ల పేలుళ్లతో బీభత్సం సృష్టించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తాజాగా ఎయిర్ ఫోర్స్ కు పనిచెప్పింది. ఉగ్రవాద గ్రూపులకు చెందిన 300 స్థావరాల(Sites)పై క్షిపణులతో దాడి చేశామని, గాజా తర్వాత ఇదే అతి పెద్ద దాడి అని నెతన్యాహు సర్కారు తెలిపింది.