ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్న సర్కారు.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రతి నియోజకవర్గం(Segment)లో ఒక అర్బన్, మరో రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని రివ్యూలో CM రేవంత్ ఆదేశించారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్ సహా సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా ఇక ఒకే కార్డు ఉండాలన్నది సర్కారు లక్ష్యం.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు(Welfare Schemes), ఆరోగ్య సేవలు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాల వారీగా మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉందన్న అభిప్రాయానికి వచ్చారు. రాజస్థాన్, హరియాణా, కర్ణాటకల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని అధ్యయనం చేయాలని CM స్పష్టం చేశారు.