కర్ణాటక CM సిద్ధరామయ్యకు హైకోర్టులో షాక్ తగిలింది. తనపై విచారణకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాల్ని తిరస్కరించాలంటూ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించడంతో ఇక… MUDA(మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్కాంలో ఆయన విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. CM తన సతీమణి బి.ఎం.పార్వతికి మైసూరు పరిసరాల్లో 14 స్థలాలు కేటాయించడంతో సర్కారుకు రూ.45 కోట్ల నష్టమని, విచారణ జరిపించాలంటూ ప్రదీప్ కుమార్, టి.జె.అబ్రహం, స్నేహమయి కృష్ణ… గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కోరారు.
CM దంపతులు, వారి కుమారుడు యతీంద్ర సహా సీనియర్ అధికారుల పేర్లను ఫిర్యాదులో తెలియజేశారు. ఆ భూమిని పార్వతి సోదరుడు మల్లికార్జున 1998లో గిఫ్ట్ గా ఇచ్చాడని CM చెప్పారు. అయితే ఆ ల్యాండ్ కు అక్రమంగా 2004లో రిజిస్ట్రేషన్ చేయించారని, దాన్ని 1998లోనే కొన్నట్లుగా నకిలీ డాక్యుమెంట్లు చూపారని స్నేహమయి కృష్ణ ఆరోపించారు. 2014లో సిద్ధరామయ్య CM టైంలో ఆ భూమికి పరిహారం ఇవ్వాలని పార్వతి కోరారు. దీంతో ఈ ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టాలంటూ లోకాయుక్తకు గవర్నర్ ఆదేశాలిచ్చారు.