తెలంగాణ ఉద్యోగుల JACకి పూర్తిస్థాయి కార్యవర్గం ఏర్పాటైంది. 205 భాగస్వామ్య సంఘాలు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై కమిటీని ప్రకటించాయి. TNGOల సెంట్రల్ యూనియన్ కు చెందిన మారం జగదీశ్వర్ ఛైర్మన్ గా, ఏడుగురు కో-ఛైర్మన్లు, 21 మంది వైస్ ఛైర్మన్లతోపాటు మొత్తం 101 మందితో కమిటీ ఏర్పాటైంది.
2022 జులై 1 నుంచి 2024 జులై 1 దాకా బకాయి ఉన్న 5 DAలను నగదు రూపంలో చెల్లించడం, ఇ-కుబేర్ వ్యవస్థను రద్దు చేసి 2022 నుంచి పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని క్లియర్ చేయడం, ధరల పెరుగుదల ప్రకారం 51% ఫిట్మెంట్ తో PRC అమలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) అమలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(CPS&UPS) విధానాల్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడంతోపాటు వివిధ సమస్యల పరిష్కారం లక్ష్యంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు JAC తెలిపింది.